“అమరావతే ఏకైక రాజధాని కావాలి” అని నినాదాలు చేస్తూ వందలాది మంది రైతులు రోడ్లపైకి వచ్చారు. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని గంటల పాటు రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
రైతు నాయకులు మాట్లాడుతూ, ఇప్పటికే తమ భూములు ఇచ్చి రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేశామని, ఇప్పుడు మూడురాజధానుల నిర్ణయం అన్యాయమని తెలిపారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు.
0 Comments