తిరుపతిలో వర్షం ముంచెత్తిన నగరం – ప్రజలు ఇబ్బందుల్లో-NationalNewsMitra

గత రెండు రోజులుగా తిరుపతిలో కురుస్తున్న వర్షాలు నగరాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రాత్రి నుండి ఉదయం వరకూ కురిసిన భారీ వర్షంతో రహదారులన్నీ చెరువుల్లా మారిపోయాయి. రైల్వే స్టేషన్ రోడ్, అల్ిపిరి రోడ్, లీలామహల్ సర్కిల్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రజలు ఉద్యోగాలకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళడం కష్టమైపోయింది. చాలామంది ఇళ్లలోనే ఇరుక్కుపోయారు. కొన్ని కాలనీల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు రాత్రంతా నిద్రలేక గడిపారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పంపింగ్ మిషన్లు పంపించినా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పరిస్థితి అదుపులోకి రావడం లేదు.

ప్రజలు ప్రభుత్వం తరఫున శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ వర్షాకాలంలో ఇదే సమస్య వస్తుందని, తిరుపతి లాంటి యాత్రానగరానికి ఇది మంచిది కాదని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments