పశ్చిమ బెంగాల్‌లో వర్షాల హెచ్చరిక-NationalNewsMitra

భారత వాతావరణ శాఖ పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంత జిల్లాలకు వర్షాల హెచ్చరిక జారీ చేసింది.

దక్షిణ 24 పరగణాలు, పుర్బ మెదినిపూర్, కోల్‌కతా నగరాల్లో ఈ రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

బెంగాల్‌లో దుర్గా పూజ వేడుకలు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ వర్షాలు ఆటంకం కలిగించవచ్చని అధికారులు చెబుతున్నారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు ఇచ్చారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

వర్షాల కారణంగా రవాణా సౌకర్యాలు, రహదారి పరిస్థితులు దెబ్బతినే అవకాశముందని, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

రాబోయే వారం వరకు వర్షపాతం కొనసాగుతుందని అంచనా వేశారు.

Post a Comment

0 Comments