కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, కవితా వేదికలు, నాటకాలు, తెలుగు పాటలు ముఖ్య ఆకర్షణలుగా నిలిచాయి. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు తమ చిన్నారులను కూడా ఈ వేదికపై తెలుగు కవితలు చదివేలా ప్రోత్సహించారు.
ప్రవాస భారతీయుల సంఘాలు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని తమ భాష, సంస్కృతి పరిరక్షణకు మరింత కృషి చేయాలని నిర్ణయించుకున్నాయి. చిన్నారులలో తెలుగు భాషా గౌరవం పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఇకపై ప్రతి సంవత్సరం సౌదీ లో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడంతో ప్రవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments